ఒలింపిక్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి..

by Shyam |
sports-madam
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌లో ఆడటం వల్ల మాలో ఆత్మవిశ్వాసం మెండుగా పెరిగిందని భారత మహిళా హాకీ జట్టు ప్లేయర్ నేహా గోయల్ వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్‌కు మొట్టమొదటి సారిగా అర్హత సాధించిన మహిళా హాకీ జట్టు తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నది. బలమైన గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడిపోయినా భారతీయుల మనసులను మాత్రం గెలుచుకున్నారు. ఓడిపోయినా హాకీ జట్టుకు ఎంతో మంది రివార్డులు ప్రకటించారు.

కాగా, మెగా క్రీడల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని నేహా అంటున్నది. మా మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడంలో సాయపడింది. అంతర్జాతీయ వేదికలపై ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని నేహా చెప్పుకొచ్చింది. మా ఫిట్‌నెస్‌ను పెంచుకోవడానికి దోహదపడటమే కాకుండా సరైన శిక్షణ దిశగా మమ్మల్ని నడిపించిందని నేహా చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed