- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశ్వ క్రీడలకు నిబంధనలు ఇవే
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్ 2021 జులై నెలలో ప్రారంభం కానున్నాయి. గత కొన్ని రోజులుగా విశ్వక్రీడలు జరుగుతాయా లేదా అనే సందేహాల మధ్య ఆతిథ్య జపాన్ దేశంతో పాటు ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కమిటీ (ఐవోసీ) స్పష్టతనిచ్చాయి. టోక్యో వేదికగా ఒలంపిక్స్ జరుగుతాయని చెబుతూనే.. గత రాత్రి నిబంధనలతో కూడిన ఒక బుక్‌ను విడుదల చేసింది. ఒలంపిక్స్, పారా ఒలంపిక్స్ కలిపి 25 వేలకు పైగా అథ్లెట్లు, భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది పాల్గొంటారు. వీళ్లందరూ టోక్యో చేరగానే ఎలా వ్యవహరించాలనే దానిపై బుక్ లెట్ విడుదల చేసింది. ఒలంపిక్స్‌లో భాగస్వామ్యం అయ్యే ప్రతీ ఒక్కరూ మాస్క్‌ను తప్పని సరిగా ధరించాల్సి ఉంటుంది.
తినే సమయంలో, తాగే సమయంలో తప్ప అన్ని సమయాల్లో మాస్కును ధరించాలని నిబంధన పెట్టారు. పడుకునే సమయంలో కూడా మాస్కును తీయరాదని పేర్కొన్నారు. మరోవైపు టోక్యోలోని ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇక ఒలంపిక్ విలేజ్‌లో గట్టిగా అరవడం, పాటలు పాడటం, గుంపులుగా నృత్యాలు చేయడాన్ని ఐవోసీ నిషేధించింది. మొత్తం 32 పేజీలతో కూడిన ఈ బుక్‌లెట్‌లో ఆటగాళ్లు, ఇతరు సిబ్బంది అనుసరించాల్సిన నిబంధనలు పేర్కొన్నారు. కాగా, ఒలంపిక్స్‌లో పాల్గొనే వాళ్లు తప్పని సరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధనల లేదని స్పష్టం చేశారు.