పుల్వామా ఘటనపై NIA ఛార్జిషీట్ దాఖలు..

by Shamantha N |   ( Updated:2020-08-25 08:02:35.0  )
పుల్వామా ఘటనపై NIA ఛార్జిషీట్ దాఖలు..
X

దిశ, వెబ్‌డెస్క్: పుల్వామా దాడి ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) జమ్మూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌తో పాటు అతని సోదరుడు రౌఫ్ అస్ఘర్ పేరును NIA ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది.ఈ విషయాన్ని టీఓఐ(TOI) సీనియర్ ఎటిటర్ భారతీ జైన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

2018 సంవత్సరంలో జైషే చీఫ్ మసూద్ అజర్ మేనల్లుడు ఉస్మాన్ హైదర్‌ను ఇండియన్ ఆర్మీ ఎన్ కౌంటర్ చేసింది. దానిని మసూద్ అజార్ ఖండించడమే కాకుండా, “విట్రియోలిక్” వీడియోను విడుదల చేసి కశ్మీరీ యువకులను రెచ్చగొట్టాడు. దాని వల్లే పుల్వామా బాంబర్ ఆదిల్ దార్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ఎన్‌ఐఏ ఛార్జీషీట్‌లో ఉదహరించింది.

NIA ఛార్జిషీట్ పై స్పందించిన భారతీ జైన్.. మారుతి ఇకో కారులో 200కిలోల హై-గ్రేడ్ పేలుడు పదార్థాలు నింపి.. బాంబర్ ఆదిల్ దార్ సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. అంతేకాకుండా రూ.32,90,719 ప్రజా ఆస్తికి నష్టం వాటిల్లిందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Advertisement

Next Story