- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆపన్న హస్తం కోసం గీతకార్మికుడు ఎదురు చూపు
దిశ, వెబ్‌డెస్క్ : ఆయనది నిరుపేద కుటుంబం. గీత వృత్తినే నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన్ను విధి పగబట్టింది. తాటి చెట్టు పైనుంచి పడి కోలుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగి ఓ కాలును పోగొట్టుకున్నాడు. వెంటవెంటనే జరిగిన విషాదాలతో ఆ కుటుంబం చితికి పోయింది. అప్పటికే రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గురు ఆడపిల్లల పెళ్లిలు చేసిన ఆయన.. ప్రస్తుతం వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులతో కుదేలయ్యాడు. ఒంటికాలుతో మంచానికే పరిమితమై కుటుంబానికి భారంగా మారాడు. వైద్యానికి సాయం చేయాలని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బిక్కి వెంకటనారాయణ గౌడ్‌ది పేద కుటుంబం. కుల వృతి చేసుకుంటూ జీవనం సాగిస్తూనే ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు. ఆడపిల్లలను ఓ ఇంటివారిని చేశాను అనుకునే సమయంలోనే అతనిపై కాలం కన్నెర చేసింది. రోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. తాడి చెట్టు పైనుండి పడటంతో వెన్ను పూసకు, తలకు బలమైన గాయాలయ్యాయి. ఆ గాయాలతో పిడ్స్ వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు . భార్య నర్సమ్మ అందినకాడల్లా అప్పు చేసి సుమారు రూ.10 లక్షలతో భర్తకు చికిత్స చేయించి.. ప్రాణాలు నిలుపుకుంది.
కాస్త కుదుట పడుతున్న సమయంలో మరో ప్రమాదం వెంటాడింది. జూలై 23న కర్విరాల కొత్తగూడెం సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలును పూర్తిగా కోల్పోయాడు. ఇప్పటికే అప్పుల కుప్ప పేరుకుపోయిన ఆ కుటుంబానికి మరో ఆదెరువు లేదు. గీత వృత్తినే నమ్ముకున్న వెంకటనారాయణ గౌడ్.. కాలు కోల్పోవడంతో మంచానికే పరిమితం అయ్యాడు. ప్రస్తుతం భార్య నర్సమ్మ కూలి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వెంకటనారాయణ గౌడ్ చికిత్సకు, మందులకు ప్రతినెల రూ.10 వేలు ఖర్చు అవుతున్నాయి. ఆ నిరుపేద కుటుంబానికి వైద్య ఖర్చులు భారంగా మారాయి. ప్రభుత్వం, దాతలు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.