నేటి ముఖ్యాంశాలు 

by  |
నేటి ముఖ్యాంశాలు 
X

దిశ, వెబ్ డెస్క్: నేడు లోక్ సభ ఆలస్యంగా ప్రారంభం కానుంది. సాధారణంగా మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కావాల్సిన లోక్ సభ, ఈరోజు సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది.

నేడు ఏడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా కేసులు, కట్టడి చర్యలపై చర్చించనున్నారు.

ఈరోజు రాత్రి 8గంటలకు పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యదర్శుల సమావేశం జరగనుంది.

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఈరోజు ఉదయం 9గం.లకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు సహా జలవనరుల అంశాలపై ఆయనతో చర్చించనున్నారు జగన్.

చైనా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్ కేసులో ఈడీ విచారణ నేటి నుండి కొనసాగనుంది. 8 రోజులపాటు నిందితులను ఈడీ విచారించనుంది.

డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. జయ సాహా, మధు మంతెన, శృతి మోడీ లను మరోసారి విచారించనుంది ఎన్సీబీ. ఈరోజు ఉదయం 11గం.లకు మధు మంతెన ను విచారించనుంది ఎన్సీబీ. మధ్యాహ్నం 2 గంటలకు జయ సాహా ను విచారణకు రావాలని ఆదేశించింది. అదే టైమ్ కి క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ సీఈఓ ధ్రువ విచారణ కూడా జరగనుంది.

సుశాంత్ సింగ్ కేసు: సినీ నటి రియా, ఆమె సోదరుడు షోవిక్ బెయిల్ పిటిషన్ పై నేడు బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది.

తెలంగాణలో మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. నేడు పలువురు అనుమానితులు, సాక్ష్యులను ఎసిబి విచారించనుంది.

ఏపీలో బస్సుల్లో ప్రయాణికుల అనుమతి విషయంలో నిబంధనలు సడలిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 50 శాతం సీట్లలోనే ప్రయాణికులను అనుమతించాలనే నిబంధనను ఎత్తివేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా శానిటైజర్ వాడాలనే నిబంధన విధించింది. ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. బస్సుల్లో నిలబడి ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ.


Next Story