రికార్డులు బ్రేక్ చేసిన బంగారం ధర    

by  |
రికార్డులు బ్రేక్ చేసిన బంగారం ధర    
X

దిశ, వెబ్ డెస్క్: బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ గోల్డ్ రేట్ పెరిగింది. గురువారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ధర అమాంతం 765 రూపాయలు భారమై మొదటిసారిగా సారిగా 55,863 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి ఏకంగా 4,074 రూపాయలు పెరిగి 75,967 రూపాయలకు ఎగిసింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై పెనుప్రభావం చూపుతుందనే అంచనాల నడుమ మదుపుదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కనకం ధర కొండెక్కి కూర్చుంటోంది.

ఇక ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఏకంగా 2055 డాలర్ల ఆల్‌టైం హై కి చేరింది. అంతర్జాతీయం అమెరికన్‌ డాలర్‌ కూడా బలహీనపడటం, మదుపరులు పెట్టుబడులు షేర్ మార్కెట్ కంటే బులియన్ మార్కెట్ సేఫ్ గా భావించడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. అటు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికన్‌ డాలర్‌ పుంజుకుంటే బంగారం ధరల్లో కొంత తగ్గుదల నమోదయ్యే అవకాశం ఆశిస్తున్నారు.


Next Story

Most Viewed