- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో మరో ఇద్దరి మృతి
– 14 కొత్త కేసులు
– నేటి నుంచి మరింత ముమ్మరంగా వైద్యపరీక్షలు
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో మరో ఇద్దరు పేషెంట్లు కరోనా కారణంగా మృతి చెందారు. కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 872కు చేరుకుంది. కొత్త పేషెంట్లు పుట్టుకొస్తున్నా.. ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నవారు మాత్రం డిశ్చార్జి కావడంలేదు. చికిత్స పొందుతున్నవారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, ఆక్సిజన్‌గానీ వెంటిలేటర్ అవసరంగానీ లేకుండా ఉన్నారని ముఖ్యమంత్రి చెబుతున్నా రోజుకు ఇద్దరు చొప్పున చనిపోతూనే ఉన్నారు. వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 16న మీడియాతో మాట్లాడుతూ.. 17వ తేదీన సుమారు 130 మంది డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఎవ్వరూ డిశ్చార్జి కాలేదు. కానీ కొత్తగా పాజిటివ్ కేసులు మాత్రం కంటైన్‌మెంట్ క్లస్టర్ల నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య 23కు చేరుకుంది.
ఇదిలా ఉండగా, కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది అనుమానితులకు చేస్తున్న వైద్యపరీక్షలు ఇకమైన ముమ్మరం కానున్నాయి. ప్రస్తుతం స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రెండు రోజులకు ఒకసారి లేదా ప్రతీరోజూ ఇంటింటికి తిరిగి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నారు. పాజిటివ్ కేసులు నమోదైనచోట్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో పాటు సమీప ఇండ్లల్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి, కరోనా లక్షణాలను తెలుసుకుంటున్నారు. అయితే ఇకపైన తీవ్రత ఎక్కువగా ఉన్నచోట్ల ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం వివరాలను సేకరించి అవసరాన్ని బట్టి క్వారంటైన్ లేదా ఐసొలేషన్‌కు పంపనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. విదేశీ ప్రయాణీకులు, మర్కజ్ యాత్రికులు, వారితో ప్రైమరీ, సెకండరీలో ఉన్నవారందరిని గుర్తించామని, ఇప్పుడు స్థానికంగా ‘లోకల్ ట్రాన్స్‌మిషన్’ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణలో ఇంకా ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’ దశలోకి వెళ్ళలేదని, పూర్తిగా అదుపులోనే ఉందని, కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేయడంవల్ల వైరస్ వ్యాప్తి కాకుండా బాగా నియంత్రించగలిగామని ఆ అధికారి వ్యాఖ్యానించారు.
Tags: Telangana, Corona, Deaths, New positive cases, Containment Clusters