ఆయన వస్తున్నారు ఏర్పాట్లు జాగ్రత్త

by Shyam |   ( Updated:2020-07-12 22:18:35.0  )
ఆయన వస్తున్నారు ఏర్పాట్లు జాగ్రత్త
X

దిశ, మహబూబ్‎నగర్: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాకు రానున్నారు. గత వారం రోజులుగా మంత్రి పర్యటనకు సంబందించిన ఏర్పాట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పర్యవేక్షించి అధికారులు ఎక్కడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అదేశించారు.

పర్యటన వివరాలు:

aఈ రోజు ఉదయం 10గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మయూరి ఏకో పార్కుకు ముందుగా మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. అక్కడ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటుతారు. అలాగే మియావాకీ తరహా అడవుల పెంపకం కార్యక్రమాన్ని కూడా మంత్రి ప్రారంభించి రెయిన్ ఫారెస్టు పరిసరాలను పరిశీలించనున్నారు. కొత్తగా నిర్మించిన పాలమూరు వైద్య కళాశాల భవనాన్ని మంత్రి ఈటెలతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం అదితర అభివృద్ధి, సంక్షేమ పథకాల అందజేత కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Advertisement

Next Story

Most Viewed