నేడు మహాకవి గురజాడ జయంతి

by  |
నేడు మహాకవి గురజాడ జయంతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహాకవి గురజాడ అప్పారావు 158వ జయంతిని సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ జయంత్రి కార్యక్రమాల్లో జిల్లాల్లోని అధికారులు, ప్రజాపతినిధులు, కలెక్టర్లు, సాహితీవేత్తలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళి ఆర్పించనున్నారు.

విశాఖ జిల్లా, రాయవరం (ఎలమంచిలి)లో 1862 సెప్టెంబరు 21న గురజాడ జన్మించారు. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి ఎంతో కృషి చేశాడు.


Next Story

Most Viewed