నేడు ఈ హీరోయిన్ పుట్టినరోజు

దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ సీనియర్ హీరోయిన్ రేవతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రముకులు, సినీ ప్రముఖులు, అభిమానులు, ఇతరులు ఆమెకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రేవతి.. తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. భారతీ రాజా మన్ వాసనై తమిళ చిత్రంతో సినిమా తెరపై తళుక్కుమన్న రేవతి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. అంతేకాదు ఆమె దర్శకురాలిగా కూడా పని చేశారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నటి ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది.

Advertisement