18 లక్షలు దాటిన కరోనా కేసులు

by Anukaran |
18 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఎందుకంటే కరోనా వైరస్ లెక్కలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 52,972 కొత్త కేసులు నమోదు కాగా, 771 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 18 లక్షల 3 వేల 696 కు చేరింది. ఇటు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 38,135 కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 11 లక్షల 86,203 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 5 లక్షల 79,357 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 2 లక్షల 2,858 మందికి కరోనా టెస్టులు చేయగా, గడిచిన 24 గంటల్లో 3 లక్షల 81,027 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed