ఏపీలో తాజాగా ఎన్ని కేసులంటే?

by srinivas |
ఏపీలో తాజాగా ఎన్ని కేసులంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,47,977 కి చేరుకుంది. ఇందులో 20,915 యాక్టివ్ కేసులుండగా 8 లక్షల 20 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 1,761 మంది డిశ్చార్జి అయ్యారు. అంతేగాకుండా కొత్తగా కరోనా బారినపడి 14 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,828కు పెరిగింది.

Advertisement

Next Story