ఏపీలో 2 లక్షలు దాటిన కేసులు

by  |
ఏపీలో 2 లక్షలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. ఏకంగా 10,171 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో 89 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,842కి చేరింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తంగా 2,06,960 కేసులు నమోదు అయ్యాయి. కాగా, ఇప్పటివరకు 1,20,464 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 84,654 యాక్టివ్ కేసులు ఉన్నట్టు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

కర్నూలు -1331
తూ.గో. -1270
అనంతపురం: -1100
చిత్తూరులో -980
నెల్లూరులో -941
విశాఖపట్నంలో -852
గుంటూరులో -817
కడపలో -596
పశ్చిమ గోదావరిలో -548
విజయనగరంలో -530
శ్రీకాకుంలో -449
కృష్ణలో -420
ప్రకాశంలో -337 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story

Most Viewed