- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడికి పాస్ పోర్టుల సీజ్
దిశ, నిజామాబాద్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్ -19) భారత్‌నూ భయపెడుతోంది. ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. ఇంకా తీసుకుంటున్నాయి. కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించింది. తెలంగాణలో విదేశాల నుంచి ఇటీవల జిల్లాకు వచ్చిన వారి పాస్ పోర్టులు సీజ్ చేసే కార్యక్రమం అధికార యంత్రాంగం జోరుగా కొనసాగిస్తోంది.
ప్రతి మండలానికీ 3 ప్రత్యేక బృందాలు..
విదేశాల నుంచి వచ్చిన వారికి స్థానికంగా ఎయిర్‌పోర్టులో అధికారులు కరోనా టెస్టులు చేసి స్టాంపింగ్ వేసి పంపుతారు. అయితే, వారికి కోవిడ్ 19 లక్షణాలు లేకపోయినప్పటికీ 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. కాని వారు అలా ఉండకపోవడం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు విదేశాంగ శాఖ ద్వారా తెలుసుకుంటున్నారు. మార్చి 1 తర్వాత వచ్చారా లేక గత నెలలో వచ్చిన వారు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు అదే పనిలో ఉన్నారు. స్టాంపింగ్ పడిన వారు స్వీయ నిర్భందంలో ఉన్నారా లేక బయట తీరుగుతున్నారా అని ఉమ్మడి జిల్లాలో విచారణ జరుగుతోంది. ఇప్పటికే జిల్లా పరిధిలోని ప్రతి మండలానికీ 3 ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయి. గ్రామాలను పట్టాణాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటి వరకు 30 మంది వరకు అనుమానిత లక్షణాలతో కనబడినా వారికి కరోనా పాజిటివ్ రాలేదు. అయితే, ఉమ్మడి జిల్లాలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందిన వారు సుమారు 3500 మంది వరకు జిల్లాకు చేరుకున్నారు. వారిలో కొందరికి అక్షణాలు ఉండటంతో వారిని కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో లేకుంటే ప్రజలు ఫిర్యాదులు చేయాలని చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చీ స్వీయ నిర్బంధంలో లేకుండా ఉన్న వారిని నియంత్రించేందుకు ప్రభుత్వం వారి పాస్ పోర్టులు సీజ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు స్థానిక రెవెన్యూ అధికారులు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరు గ్రామాల్లోని కాలనీలు, వాడలు జల్లెడ పడుతూ పాస్ పోర్టుల సీజ్ కార్యక్రమం ముమ్మరం చేస్తున్నారు. అధికారులు చేపట్టే ఈ కార్యక్రమం ఫలితమిస్తే జిల్లాలో కరోనా బాధితుల నుంచి మరొకరికి విస్తరించదని చెప్పొచ్చు.
Tags :passport size, coronavirus (covid-19), prevention of corona