- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో విరాట్ హెల్ప్ తీసుకుంటా : అనుష్క శర్మ
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కపుల్స్ తమ తమ పర్సనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉంటారో వేరే చెప్పనవసరం లేదు. విరాట్ తీరిక లేని షెడ్యూల్స్‌తో గడుపుతుంటే, అనుష్క తన షూటింగ్స్‌తో పాటు నిర్మాతగానూ ఎంతో హెక్టిక్ వర్క్ చేస్తుంటుంది. అయితే ఈ బ్యూటిఫుల్ కపుల్స్‌కు కరోనా కాస్త విశ్రాంతినిచ్చి.. ఒక్కచోటుకు చేర్చింది. ఈ ఆరు నెలల కాలంలో విరుష్క జోడీ సరదా సరాదాగా గడుపుతూ, ఒకరి కోసం ఒకరు స్పెషల్ డిషెస్ ప్రిపేర్ చేస్తూ.. హ్యాపీ టైమ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వారి ఆనందాలను తమ అభిమానులతో పంచుకుంటూ.. వారిని కూడా ఖుషీ చేస్తున్నారు. తాజాగా అనుష్క సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీతో పాటు తమ దాంపత్య జీవితానికి, అనుష్క బ్యాలెన్స్‌డ్ లైఫ్‌కు సంబంధించిన పలు ప్రశ్నలను అనుష్కను అడిగారు ఫ్యాన్స్.
మీరెప్పుడైనా బోర్ ఫీల్ అయ్యారా?
నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు బోర్‌గా ఫీల్ అయ్యేదాన్ని. అందుకే నా స్నేహితుల్ని ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకునేదాన్ని. కానీ 20 సంవత్సరాల తర్వాత.. నాకెప్పుడూ బోర్ అనిపించలేదు. నాతో నేను ఎక్కువగా గడిపేదాన్ని.
ఓవర్ థింకింగ్‌ను ఎలా ఆపాలి ?
ఓవర్ థింకింగ్ వల్ల మీరెమైనా సాధించారా.. మీరేమైనా పొందారా? లేదు కదా!
మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?
నేను వంట చేస్తుంటాను. ‘పహడీ’ సాంగ్స్ పాడుతుంటాను.
మీకు ఓపిక ఎప్పుడు నశిస్తుంటుంది?
మనుషులు తమ పని తాము చేసుకోకుండా.. ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటే నాకు కోపం వస్తుంది. నా ఓపిక కోల్పోతాను. అంతేకాదు ఒకరి పర్సనల్ బౌండరీలను మనం గౌరవించాలి. అలా కాకుండా ప్రవర్తిస్తే.. చిరాకు వస్తుంది.
మీకు వంటకాల్లో ఏమిష్టం?
అమ్మ చేసే వెజ్ మోమోస్ అంటే నాకు ప్రాణం.
ఏ విషయాల్లో కోహ్లీని సాయం అడుగుతారు?
టైట్‌గా ఉన్న బాటిల్ క్యాప్ ఓపెన్ చేసే విషయంలో, బరువైన కుర్చీలను ఎత్తే సమయాల్లో కోహ్లీ హెల్ప్ తీసుకుంటాను.
కోహ్లీకి ఏమంటే నచ్చదు?
కోహ్లీకి ఓటమి అంటే చిరాకు. బోర్డ్ గేమ్స్‌లో అతడిని ఎప్పుడైనా ఓడించి అతడు చిరాకు పడేలా చేస్తాను.
పిల్లల గురించి ఇంట్లో వాళ్లు ప్రశ్నించడం లేదా?
లేదు. ఎవరూ అడగడం లేదు. సోషల్ మీడియాలో తప్ప.