మండలి ఛైర్మన్‌ను కలిసిన టీఎన్జీవో నేతలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, కారం రవీందర్‌రెడ్డి, పలువురు సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సాయం చేయాలని మండలి ఛైర్మన్‌ను కోరినట్లు తెలిపారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement