- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తృణమూల్‌కు భారీ షాక్.. మరో మంత్రి రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. మమతా బెనర్జీ క్యాబినెట్ నుంచి అటవీశాఖ మంత్రి రాజీబ్ బెనర్జీ శుక్రవారం రాజీనామా చేశారు. పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా ఆయన క్యాబినెట్ సమావేశాలకు గైర్హజరువుతూ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల కోసం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను పార్టీలోని కొందరు నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీటన్నింటిని బహిరంగపరచడానికి సరైన సమయం కోసం ఇన్నాళ్లు వేచి చూశానని తెలిపారు. బెంగాల్ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు ధన్యుడినని తన రాజీనామాలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్నిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అటవీశాఖ మంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని వివరించారు. తన రాజీనామా లేఖను గవర్నర్ జగదీప్ ధన్‌కర్, సీఎం మమతా బెనర్జీలనుద్దేశించి రాసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
అనంతరం రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేయడానికి రాజ్‌భవన్ వెళ్లారు. ప్రజలతో పార్టీకి ఏర్పడిన దూరాన్ని పూడ్చుకోవాలని హౌరా జిల్లాకు చెందిన దొంజుర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజీబ్ బెనర్జీ సూచించారు. పార్టీ కార్యకర్తల శ్రమను గుర్తించి వారికి తగిన గౌరవమివ్వాలని సీఎం మమతా బెనర్జీ లాగే తానూ ఆశిస్తానని అన్నారు. రాజీబ్ బెనర్జీ వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పందిస్తూ కొన్నాళ్లుగా క్యాబినెట్ సమావేశాలకు హాజరవ్వని రాజీబ్ బెనర్జీ నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఊహించామని తెలిపారు. మంత్రి పదవి నుంచి స్వయంగా వైదొలిగి మంచి పనిచేశారని, లేదంటే తామే చర్యలు తీసుకునేవారిమని పేర్కొన్నారు. ఇటీవలే సువేందు అధికారి, లక్ష్మీ రతన్ శుక్లా మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సువేందు అధికారి బీజేపీలో చేరారు. రాజీబ్ బెనర్జీ కూడా వచ్చే నెలలో కమలం పార్టీలో చేరనున్నట్టు సన్నిహితవర్గాలు తెలిపాయి.