‘సీపీఎల్ 2020ని మనం శాసించాం’

by Shyam |   ( Updated:2020-09-11 06:53:42.0  )
‘సీపీఎల్ 2020ని మనం శాసించాం’
X

దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)2020ని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (TrinBago Knight Riders) జట్టు గెలుచుకోవడంతో ఆ ఫ్రాంచైజీ యజమాని, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. గురువారం బ్రియన్ లారా స్టేడియంలో సెయింట్ లూసియా జూక్స్‌ (St. Lucia Jokes)తో జరిగిన ఫైనల్స్‌లో మరో 11 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి నాలుగోసారి సీపీఎల్ విజేతగా నిలిచింది.

ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా నైట్ రైడర్స్ (TrinBago Knight Riders) జట్టు టైటిల్ ఎగరేసుకొని పోయింది. దీంతో షారుక్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘సీపీఎల్ 2020ని మనం శాసించాం. ఆటగాళ్లు అద్భుతమై ప్రదర్శన చేశారు. మీరు మాకు గర్వకారణం. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. స్టేడియంలో జనాలు లేకపోయినా మాకు మంచి పార్టీ ఇచ్చారు. టీంను గెలిపించిన కీరన్ పొలార్డ్, సిమ్మండ్స్, బ్రావోతో పాటు నైట్ రైడర్స్ అందరికీ నా అభినందనలు. బ్రెండన్ మెక్‌కల్లమ్ ఐపీఎల్‌కు వచ్చెయ్. లవ్ యూ ‘ అంటూ షారుక్ ట్వీట్ చేశాడు. ఇది ట్రిన్‌బాగోకు నాలుగో టైటిల్‌. ఫలితంగా సీపీఎల్‌ చరిత్రలో అత్యధిక టైటిల్స్‌ గెలిచిన జట్టుగా ట్రిన్‌బాగో నిలిచింది.

Advertisement

Next Story