- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
35వేల ఉద్యోగాలిచ్చి..85వేలని చెప్తారా
దిశ, న్యూస్ బ్యూరో : అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పడం సీఎం కేసీఆర్‌కు పరిపాటుగా మారిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం అన్నారు.మంగళవారం టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 35వేల ఉద్యోగాలిచ్చి 85వేలు ఇచ్చామని చెప్పడం ఆయనకు మాత్రమే సాధ్యమని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని, దానిని విస్మరించరాదని మళ్లీ ఓసారి గుర్తుచేశారు. రాష్ట్రంలో ఐదేండ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా పోస్టులకు ఖాళీలు ఏర్పడ్డయాన్నారు. విద్యారంగానికి చాలా అద్వాన్నంగా నిధులు కేటాయించారని కోదండరాం మండిపడ్డారు. అనుమతి లేని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ధైర్యం రావడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చాలామంది యువకులు ఆత్మహత్య చేసుకున్నది కేసీఆర్‌కు తెలీదా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతను గుర్తు చేస్తే రెచ్చగొట్టడం ఎలా అవుతదో సీఎం చెప్పాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నానని తెలిపారు. మన్నారు జీవోలు అమల్లో ఉన్నప్పుడు వాటిని పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఆ జీవోను మంత్రులు పాటించక పోవడం పెద్ద నేరమన్నారు. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నామని తెలిపారు.
TAGS : Assembly, kcr, kodandaram, posts, revanth reddy, gos, ministers