- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆదుకోకపోగా… ఆర్థికభారం మోపుతోంది’
దిశ ప్రతినిధి, ఖమ్మం: కొవిడ్‌ను అడ్డుపెట్టుకుని ప్రజలకు, రైతులకు నష్టం కలిగించే చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెడుతామని స్పష్టంచేశారు. జన సమితికి విద్యావంతుల్లో బలం ఉందని నిరూపిస్తామని చెప్పారు. కష్టకాలంలో పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పన్నులతో ఆర్థిక భారం మోపుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు.
ఎల్ఆర్ఎస్ విధానం సక్రమంగా లేదని, సరైంది కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్థంలేని విధానాలతో, తన ఖజానాను నింపుకోవడానికి పేదలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజలు, రైతులు తిరగబడతారని హెచ్చరించారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ శీలం పాపారావు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా పార్టీ జిల్లా పాత కమిటీని రద్దు చేసి , కొత్త కమిటీని ఎన్నుకున్నారు.