అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీజీపీ

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గత రెండు నెలలుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం అడవుల్లో నెలకొన్న పరిణామాలపై ఆరా తీసిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిర్యాని మండలంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల గురించి స్థానిక ఎస్సై రామారావు ను అడిగి తెలుసుకున్నారు.

ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. గత నెల టోక్కిగూడెంలో జరిగిన ఎదురుకాల్పులపై ఆరా తీశారు. కరోనా సమయంలో గిరిజనులకు అందించిన సేవలపై తిర్యాని ఎస్సై రామారావును ఆయన అభినందించారు. కాగా డీజీపీ ఆసిఫాబాద్ అడవుల్లో విస్తృతంగా తిరుగుతూ చేపడుతున్న చర్యలు పోలీస్ యంత్రాంగాన్ని హడలెత్తిస్తోంది.

Advertisement