ఆ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా పాజిటివ్

by Anukaran |
ఆ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడటంతో సామాన్య జనాలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన పరీక్షలో మరోసారి ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆగస్టు నెలలో కాస్త అస్వస్థతకు గురైన కరుణాకర్‌రెడ్డికి పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన రుయా ఆస్పత్రిలో వైద్యసేవలు పొంది డిశ్ఛార్జయ్యారు.


Advertisement
Next Story

Most Viewed