రేపే తిరుపతి ఉపఎన్నిక కౌంటింగ్

by Ramesh Goud |
రేపే తిరుపతి ఉపఎన్నిక కౌంటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఈ నెల 17న ఉపఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే రేపు (ఆదివారం) ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నారు. దీనికోసం తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా ఉదృతి దృష్యా కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.

ఉదయం 8 గంటల నుండే ఓట్ల లెక్కింపు జరుగుతుందని, తిరుపతి సెగ్మెంట్ కోసం 4 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తామన్నారు. రేపు మధ్యాహ్నం వరకే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed