- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెమటకు చెక్
దిశ, వెబ్‌డెస్క్:
ఎండాకాలంలో ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లిన ఎండవేడికి చెమట పట్టడం ఖాయం. అయితే, శరీరతత్వాన్ని బట్టి కొందరిలో చెమట ఎక్కువగా వస్తే, మరికొందరిలో తక్కువగా వస్తుంటుంది. మరికొందరికేమో చెమట వల్ల వచ్చే వాసన ఇబ్బంది పెడుతోంది. చెమటకు చెక్ ఎలా చెప్పాలంటే..
ప్రతీ మనిషి శరీరంలో సుమారు రెండు నుంచి నాలుగు మిలియన్ల స్వేద గ్రంథులు ఉంటాయి .ఇవి చర్మం కింద ఉండే డెర్మిస్ పొరలో ఉంటాయి. ఆ గ్రంథుల నుంచే చెమట వస్తుంది. వేసవిలో ఉండే వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత ఉండాల్సిన దాని కంటే పెరిగిపోతుంది. దాన్ని చల్లబర్చేందుకు చెమట ఎక్కువగా ఏర్పడుతుంది. వేసవిలో చెమట నుంచి, దుర్వాసన నుంచి బయటపడాలంటే ముందుగా వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే రోజుకు రెండు, మూడు సార్లు స్నానం చేయాలి. కొన్ని పుదీనా ఆకులను నీటిలో కలిపి స్నానం చేస్తే ఆ రోజంతా చర్మం తాజాగా ఉంటుంది. దాంతో చెమట పట్టినా దుర్వాసన రాదు. చెమట వాసన రాకుండా చేసేందుకు ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి.
బేకింగ్ సోడా:
వంటసోడాలో చెమటను పీల్చుకునే లక్షణాలు ఉంటాయి. బ్యాక్టీరియా వృద్ధిని ఇది అరికడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్‌సోడాను కప్పు నీళ్లలో కలిపి… చెమట ఎక్కువగా పట్టే భాగాల్లో ఈ నీటితో తుడుచుకుంటే దుర్గంధం సమస్య తీరుతుంది.
నిమ్మరసం:
నిమ్మరసం దుర్వాసకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. నిమ్మకాయను ముక్కలుగా కోసి శరీర దుర్వాసన వచ్చే భాగాల్లో కాసేపు మర్దన చేయాలి. ఇలా చేస్తే వాసన రాకుండా ఉంటుంది.
ఆహారం జాగ్రత్తలు:
వేసవిలో చెమటను తగ్గించాలంటే మసాలా ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కాఫీలు, టీ, కోక్ లు కూడా చెమటకు, దుర్వాసనకు కారణం అవుతాయి. . కాబట్టి కాఫీ, టీ, కోక్ వంటి వాటిని మితంగా తీసుకోవడం మంచిది.
గ్రీన్ టీ :
గ్రీన్ టీలో ఉండే టానిన్లు చర్మాన్ని పొడిగా ఉంచుతాయి. చెమట, దుర్వాసన వంటి సమస్యలను నివారిస్తాయి. లీటర్ వేడి నీటిలో రెండు గ్రీన్ టీ బ్యాగులను పది నిమిషాలు ఉంచి తీసేయాలి. ఈ నీటిని స్నానం చేసే నీళ్లలో కలిపేసి ఫ్రెష్ అయితే దుర్వాసన రాదు.
Tags: summer, sweat, smell, easy tips