టిండర్‌లో ‘వన్ ప్లస్’ ఫీచర్

by Shyam |
Tinder4
X

దిశ, ఫీచర్స్: ప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’ తమ వినియోగదారులకు ఎక్స్‌ప్లోర్ విభాగంలో ‘ప్లస్ వన్’ అనే ఒక కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వివాహం చేసుకోవడానికి తాము రెడీగా ఉన్నామని తెలిపే.. అర్హతలు, రిక్వైర్‌మెంట్స్, ప్లేస్ వంటి వివరాలను తెలిపే ప్రొఫైల్‌ను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది.

సాధారణంగా ‘టిండర్’ యాప్‌‌తో వివాహానికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ, ప్లస్ వన్ అనే న్యూ ఫీచర్‌తో కంపెనీ దానిని మార్చాలని చూస్తోంది. ఇది రాబోయే వివాహా తేదీలను కనుగొనడంలో తన వినియోగదారులకు సహాయపడగలదు. వెడ్డింగ్‌వైర్ భాగస్వామ్యంతో ఈ ఫీచర్ అభివృద్ధి చేయగా, అమెరికాలో ప్లస్ వన్ కోసం సైన్ అప్ చేసిన మొదటి 100 మందికి $ 460 గ్రాంట్ కూడా అందిస్తోంది. ‘వెడ్డింగ్ గెస్ట్ గ్రాంట్’గా పిలుస్తున్న ఈ డబ్బులు త్వరలో వివాహం చేసుకోబోయే జంట కోసం బహుమతి కొనడానికి, సాధారణ ఖర్చులను భరించడంలో సాయం చేస్తుంది. కొవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు సగం వివాహాలు వాయిదా పడ్డాయి. దీంతో 2021తో పోలిస్తే 2022లో వివాహాల్లో 20% పెరుగుదల ఉంటుందని వెడ్డింగ్‌వైర్ అంచనా వేసింది. వినియోగదారులు ప్లస్ వన్ ఫీచర్ ద్వారా ‘వారు పెళ్లి తేదీ కోసం వెతుకుతున్నారు, లేదా సిద్ధంగా ఉన్నారు’ అని సూచించవచ్చని టిండర్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఫీచర్ ప్రొఫైల్స్‌పై స్వైప్ చేయడం, పొటెన్షియల్ మ్యాచ్‌లతో చాట్ చేయడం, ఆపై ఆఫ్‌లైన్‌లో కలవడం వంటి ప్రోటోటైపికల్ టిండర్ అనుభవాన్ని అందిస్తుందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed