- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మారిన బ్యాంకుల టైమింగ్స్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులు పని వేళలను మార్చుకున్నాయి. ప్రతీరోజూ ఉదయం పది గంటల నుంచి పనిచేయాల్సిన బ్యాంకులు లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులు ఉదయం 8.00 గంటలకే తెరుచుకోనున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు మూతపడే బ్యాంకులన్నీ పన్నెండు గంటలకే క్లోజ్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవడంతో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ బుధవారం సమావేశమై ప్రభుత్వ నిర్ణయానికి సహకారం అందిస్తూనే వినియోగదారులకు కూడా సేవలందించేలా ప్రతీ రోజు ఉదయం 8.00 గంటల నుంచి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నది.
వినియోగదారులకు సేవలందిస్తూనే బ్యాంకుల్లో సిబ్బంది సగం మంది మాత్రమే హాజరుకావాలని, రోజు విడిచి రోజు విధులకు హాజరయ్యేలా స్టాఫ్‌కు సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు జనరల్ మేనేజర్ కృష్ణన్ శర్మ లేఖ రాశారు. రోజువారీ జరిగే బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ జరుగుతాయని, అయితే కోర్ బ్యాంకింగ్, సైబర్ యాక్టివిటీస్ లాంటివన్నీ యథావిధిగా పూర్తిస్థాయిలో పనిచేస్తాయని వివరించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది విధిగా ఐడీ కార్డులను వెంట ఉంచుకోవాలని నొక్కిచెప్పారు. పోలీసులు కూడా ఇబ్బంది పెట్టవద్దని లేఖ ద్వారా కోరారు.