టిక్ టాక్ అప్‌డేట్ : అడ్రస్‌లు సేకరిస్తోందట!

by Harish |   ( Updated:2020-08-12 06:44:24.0  )
టిక్ టాక్ అప్‌డేట్ : అడ్రస్‌లు సేకరిస్తోందట!
X

భద్రతా విషయాలపరంగా టిక్‌టాక్ (Tictok)యాప్‌ను ప్రోత్సహించడం ఏమాత్రం మంచిది కాదని భారతదేశం(India) నిషేధించిన సంగతి తెలిసిందే. ఇదే తోవలో అమెరికా (Us) వంటి దేశాలు కూడా టిక్ టాక్‌ను నిషేధించే (Ban) యోచనలో ఉన్నాయి. అయితే దీని సంగతేంటో తెలుసుకుందామనే ఉద్దేశంతో ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ (Wall streat journal) ఒక రహస్య విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో పాపులారిటీ పేరుతో టిక్ టాక్ చేస్తున్న తప్పుడు పనులన్నీ బయటపడ్డాయి. వాటిలో ఒకటి గూగుల్ ప్లే స్టోర్ (google play store), ఆపిల్ యాప్ స్టోర్ (Apple play store) ప్రాథమిక పాలసీలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. సాధారణంగా ఏ యాప్ అయినా సరే.. యూజర్ పరికరం మాక్ అడ్రస్ లేదా మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్‌ను ట్రాక్ చేయవద్దు.

ఈ అడ్రస్‌ను ప్రకటనల విషయంలో, ఇతర తప్పుడు పనులకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ అడ్రస్ ద్వారా గ్యాలరీలో వీడియోలు, ఫోటోలను యాక్సెస్ చేయవచ్చు. కాబట్టి ఈ అడ్రస్‌ను యాప్‌లు సేకరించవద్దని ప్లే స్టోర్‌లో ఒక నిబంధన (Condition) ఉంది. 2015 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. కానీ ఏదో చిన్న తప్పిదం కారణంగా కోడింగ్‌ (Coding)లో కొన్ని మార్పులు చేసుకుని టిక్‌టాక్ యాప్ గత 18 నెలలుగా తమ యాప్ వినియోగదారుల మాక్ అడ్రస్‌ (Mac address)లను సేకరిస్తోందని ఈ విచారణలో తేలింది. ఈ అడ్రస్‌ను ఉపయోగించుకునే ప్రాంతాల వారీగా కావాల్సిన కంటెంట్‌ను టిక్ టాక్ (Tictok) విభజించగలుగుతోందని తెలిపింది. అయితే టిక్ టాక్ విశ్వసనీయతకు తీవ్రస్థాయిలో నెగెటివ్ పబ్లిసిటీ (Negetive publicity) వస్తున్న తరుణంలో ఇలాంటి విచారణ బయటపడటం నిజంగా ఇబ్బందికరమే. దీంతో టిక్ టాక్ మళ్లీ తిరిగిరానుందని ఆశలు పెట్టుకున్న టిక్‌టాకర్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.

Advertisement

Next Story