బండీపుర అడవుల్లో దారుణం..

by Shamantha N |
బండీపుర అడవుల్లో దారుణం..
X

దిశ, వెబ్‌డెస్క్ : వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి పెద్దగా ఫలితాలనివ్వడం లేదని తెలుస్తోంది. ఆసియాలో అంతరించే పోయే జాబితాలో ఉన్న బెంగాల్ టైగర్స్‌ను భారత్ కాపాడుతూ వస్తోంది. వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు సైతం చేపడుతోంది. ప్రస్తుతం దేశంలో 3వేలకు పైగా పెద్దపులులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇటీవల తిండి దొరక్క వరుసగా పెద్దపులులు మరణిస్తున్నాయి.

మరికొన్ని ఆహారం కోసం జనారణ్యాల్లోకి ప్రవేశించి పశువులు, మనుషులపై దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా బండీపుర అడవుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆహారం దొరక్క రెండు పెద్దపులి పిల్లలు మృత్యువాత పడ్డాయి. గమనించిన ఫారెస్టు అధికారులు మరో పులిపిల్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుసగా పెద్దపులులు మరణిస్తుండటంపై వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed