- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే కార్యాలయంపై పిడుగు
by Shyam |

X
దిశ, నల్లగొండ: దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కు, ఆయన కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఆయన క్యాంప్ కార్యాలయంపై పిడుగు పడింది. నియోజకవర్గంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో కార్యాలయం పైనున్న పెంట్ హౌస్‌పై పిడుగు పడింది. ఆ సమయంలో రవీంద్రకుమార్, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. పెంట్ హౌస్‌పై ఉన్న పిట్టగోడ అంచున ఈ పిడుగు పడడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఉమ్మడి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి ఫోన్ చేసి పరిస్థితిని ఆరాదీశారు.
Tags: thunderbolt, deverakonda, mla camp office, mla ravindra kumar, rains, ktr, minister jagadeeshwr reddy,
Next Story