- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదేళ్లలో రూ. 25,586 కోట్లు మంజూరు
దిశ, వెబ్‌డెస్క్: షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళా పారిశ్రామిక వేత్తలకు సులభంగా రుణాలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్టాండప్ ఇండియా పథకం రూ. 25,856 కోట్లను మంజూరు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం ప్రత్యేకంగా షేడ్యూల్డ్ కులాలు, షేడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామిక వేత్తలకు తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఈ పథకంలో భాగంగా కేంద్రం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలను అందిస్తోంది. దీన్ని 2016, ఏప్రిల్ 5న ప్రారంభించారు. అప్పటినుంచి గత నెల 23 వరకు ఈ పథకం కింద 1,14,322 అకౌంట్లకు రుణాలందించినట్టు ఆదివారం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇందులో మొత్తం 93,094 దరఖాస్తులతో మహిళా పారిశ్రామికవేత్తలు రూ. 21,200 కోట్లను తీసుకుని అత్యధికంగా లబ్ది పొందారని మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘ ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. ఆన్‌లైన్ పోర్టల్‌తో పాటు ఇంటెన్సివ్ పబ్లిసిటీ క్యాంపెయిన్, సులభమైన దరఖాస్తు విధానం, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్, పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలను సమర్థవంతంగా నిలిపేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడింది. అనేక సవాళ్లను అధిగమించేందుకు, ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనకు స్టాండప్ ఇండియా పథకం ఎంతో ఉపయోగపడిందని’ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.