- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్టోబర్‌లో మూడోవేవ్: కేంద్రం అంచనా
దిశ వెబ్‌డెస్క్: దేశంలో అక్టోబర్ కల్లా కరోనా మూడోవేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది. ఇప్పటికే కేరళలో కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతుండటంతో తాజాగా అంచకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. కాగా డెల్టా ప్లస్ వేరియంట్ డెల్టా కన్నా భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల ప్రారంభం వరకు 16 రాష్ట్రాల్లో 58,240 శాంపిల్స్ పరీక్షించగా 70 కేసులు డెల్టాగా నిర్ధారణ అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో కొత్త డెల్టా వేరియంట్ అందోళన కలిగిస్తోంది. కాగా ఎయిమ్స్ 4 రాష్ట్రాల్లోని 45000శాంపిల్స్ పై చేసిన పరిశోధనల్లో థర్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
నిర్లక్ష్యంతోనే మూడోవేవ్
కేంద్ర కమిటీ నివేదికపై స్పందించిన ఖరగ్ పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ప్రజల నిర్లక్ష్యమే మూడోవేవ్ రావడానికి కారణమవుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడమే దీనికి ఉత్తమమైన పరిష్కారమని పేర్కొన్నారు. ‘టీకా తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున వైరస్ వ్యాపించే అవకాశం తగ్గుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలు కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇది మంచి సంకేతం. కాగా, దేశవ్యాప్తంగా ఆక్టోబర్ వరకు 15వేలు నమోదైతే, అందులో ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కేరళలోనే నమోదవుతాయని తెలిపారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లో కేసులు తగ్గుతాయని పేర్కొన్నారు.
థర్డ్ వేవ్ ను తప్పించుకోలేమా..!
కొన్ని నిబంధనలు పాటిస్తే థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చని రాయ్ బరెలీ ఎయిమ్స్ డైరక్టర్ డా.అరవింద్ రాజ్ వంశీ తెలిపారు. ముఖ్యంగా గుంపులుగా తిరగడాన్ని నిషేధించాలి. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులను శానిటైజ్ చేయాలి. కోవిడ్ మహమ్మారి అపుడే ముగిసి పోలేదని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.