- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వికారాబాద్‌లో ఘోరం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి

X
దిశ, వెబ్ డెస్క్: రైలు ఇంజిన్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ లో మూసీనది రైల్వే బ్రిడ్జిపై ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.. రైల్వే ట్రాక్ పై 12 మంది ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వస్తున్న ఓ రైలు ఇంజిన్ వారిని ఢీకొట్టింది. దీంతో వారిలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలైనట్లు సమాచారం. అయితే, మృతులు నవీన్, శంషీర్ అలీ, ప్రతాప్ రెడ్డిగా గుర్తించినట్లు తెలిసింది. విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story