- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు లేదంటే రెండు డోసులు తప్పనిసరి.. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. సుమారు 57కు పైగా దేశాలకు పాకిన కొత్త వేరియంట్, రోజుకు రోజుకు ఈ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గిబ్రేస్ స్పందించారు. ‘ఖచ్చితంగా ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉందో, ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం మేము వేరియంట్ వేగవంతమైన మార్పులు స్థిరంగా గమనిస్తున్నాం. ప్రస్తుతానికి ఇతర వేరియంట్‌లతో పోలిస్తే పెరుగుదల రేటును గణించడం కష్టంగా ఉంది’ అని తెలిపారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉందన్నారు.
ఈ నేపథ్యంలోనే అన్ని దేశాల్లో పర్యవేక్షణ, పరీక్షలు, వైద్య సదుపాయాల కల్పన అందుబాటులోకి తీసుకురమ్మని కోరామని తెలిపారు. ‘కరోనా పోరులో మరణించని వారిలో చాలా మంది దీర్ఘకాలంగా కోవిడ్ లేదా కోవిడ్ అనంతర పరిస్థితితో పోరాడుతూ ఉండవచ్చు, ఇది బలహీనపరిచే, దీర్ఘకాలిక లక్షణాలతో కూడిన వ్యాధి’ అని చెప్పారు. ఒమిక్రాన్‌పై పోరాటానికి రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం మూడో డోసు మరింత రక్షణ కల్పిస్తుందని ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లా తెలిపారు.