ఆర్‌బీఐ ఎంపీసీ కొత్త సభ్యులు వీరే!

by Harish |
ఆర్‌బీఐ ఎంపీసీ కొత్త సభ్యులు వీరే!
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC)లో ముగ్గురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అషిమా గోయెల్ (Ashima goel), శశాంక్ భిడే (Shashank bide), జయంత్ ఆర్ వర్మల (Jayanth r varma)ను నియమిస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. నిజానికి గతనెల సెప్టెంబర్ 29 నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బీఐ పరపతి సమీక్ష జరగాల్సి ఉండగా, సభ్యుల ఎంపిక జరగని కారణంగా వాయిదా పడింది.

సెప్టెంబర్ నెలతో ఎంపీసీ సభ్యుల పదవీ కాలం పూర్తవడం, కొత్త సభ్యుల నియామకంలో జాప్యం వల్ల సమావేశం ఆలస్యమైంది. పరపతి సమీక్షలో కనీసం నలుగురు ఎంపీసీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలి. కొత్తగా నియమితులైన సభ్యులు నాలుగేళ్ల వరకూ బాధ్యతలను నిర్వహించనున్నారు. వీరిలో అషిమా గోయెల్ ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

తర్వాత ప్రధాని ఆర్థిక సలహాదారుగా బాధ్యతలను నిర్వహించారు. శశాంక్ భిడే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ అండ్ రీసెర్చ్‌లో సీనియర్ సలహాదారుగా ఉన్నారు. జయంత్ శర్మ అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనెజ్‌మెంట్‌లో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ విభాగానికి ప్రొఫెసర్‌గా పనిచేశారు. కొత్త సభ్యుల నియామకం జరగడంతో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 మధ్య జరుగుతుందని ఆర్‌బీఐ ప్రకటించింది.

Advertisement

Next Story