- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాలమూరులో మరో మూడు కోవిడ్ సెంటర్లు..
by Shyam |

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 30 నుంచి అదనంగా మరో మూడు కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. ఆక్సిజన్ ప్లాంట్, వైద్యులు పరీక్ష చేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవరకద్ర, బాలనగర్, కోయిలకొండ మండల కేంద్రాల్లో ఈ మూడు కొవిడ్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో సెంటర్లలో 50 బెడ్‌లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అవసరమైతే ప్రతీ ఒక్క మండల కేంద్రాల్లో కొవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐసోలేషన్ వార్డుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ మినహాయించి సౌకర్యాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు.
Next Story