ఒంటరిగా ఉందని రెచ్చిపోయిన కామాంధులు.. ముగ్గురు కలిసి..

by Sumithra |
Three men gang-rape
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనాతో జనజీవనం స్తంభించిపోతోంది. ఒక్కొక్కరి జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. నేడు పూట గడిస్తే చాలు అన్నట్లుగా జీవితాలు మారిపోతున్నాయి. ప్రజలు ఇంతటి దుర్భర జీవితాలు గడుపుతుండగా.. కామాంధులు మాత్రం ఏ అమ్మాయి ఒంటరిగా దొరుకుతుంది.. ఎప్పుడు అత్యాచారం చేద్దాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మహారాష్ట్రలోని బాంద్రా పశ్చిమ జిల్లాలోని ఓ పట్టణంలో యువతి(19) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఈ నెల 12న ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని స్థానికంగా ఉండే ముగ్గురు వ్యక్తులు గమనించిన ఆ ఇంట్లో చొరబడ్డారు. యువతిని బంధించి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లారు. మొదట భయపడిన యువతి ఆ షాక్ నుంచి తేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారి సాయంతో ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితులు కూడా స్థానికులే కావడంతో పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. కోర్టు ఆ ముగ్గురికి ఈ నెల 19 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

Advertisement

Next Story