- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలుగు గంగ ప్రాజెక్టులో ఈతకెళ్లి ముగ్గురు మృతి..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు గంగ ప్రాజెక్టులో ఈతకెళ్లి ఇద్దరు యువకులు, ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బీఎన్ కండ్రిగ మండలం కంపాలెంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతులు ప్రభుకుమార్(35), అరవింద్ (20), రాజు (20)లుగా గుర్తించారు. వీరంతా స్థానిక గ్రామానికి చెందిన వారు గుర్తించారు. ఈతకని వెళ్లిన ఈ ముగ్గురు తిరిగి రాకపోవడంతో స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా తెలుగు గంగలో విగతజీవులుగా కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story