- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మన్యంలో మహా విషాదం.. పెళ్లి షూట్‌కు వెళ్లి ముగ్గురు మృతి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి కోసం అందంగా ఫోటోలు తీయించుకోవడానికి ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్‌లు కామన్ అయ్యాయి. పెళ్లికొడుకు, పెళ్లికూతురును ఔట్‌డోర్ తీసుకెళ్లి అందంగా ఫోటోలు తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు.ఈ క్రమంలోనే పెళ్లి కోసం అందంగా ఫోటో దిగేందుకు విశాఖ మన్యం వెళ్లిన ముగ్గురు యువకులు తిరిగి రాలేదు. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లా తీగలవలస జలపాతం వద్ద ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
స్టిల్స్ దిగుతున్న క్రమంలో అనుకోకుండా ముగ్గురు వ్యక్తులు ఊబిలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు స్థానికులు యత్నించినా లాభం లేకుండా పోయింది. ఎట్టకేలకు మృతదేహాలను బయటకు తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలను సేకరించేపనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు.
Next Story