విశాఖలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో ఉన్న హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ లో శనివారం ప్రమాదం సంభవించింది. క్రేన్ విరిగిపడి పదిమంది మృతిచెందారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కూలిన క్రేన్ కింద మరికొందరు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement