- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో బ్లాక్ ఫంగస్ టెర్రర్.. ముగ్గురు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీని బ్లాక్ ఫంగస్ కేసులు భయపెడుతున్నాయి. రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రకాశం జిల్లాలో 10 రోజుల వ్యవధిలో 12 మంది బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెందారు. విశాఖలో ప్రతీ రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిపై ఫంగస్ దాడి చేస్తోంది. ఇటీవలే గుంటూరు జిల్లాలోని తెనాలిలో మల్లీశ్వరి అనే మహిళ బ్లాక్ ఫంగస్‌కు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
మరో వైపు తెలంగాణలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఫంగస్ బారినపడి సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ఫంగస్ బారినపడ్డారు.
Next Story