- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్యప్రాణులను వేటాడిన ముగ్గురి అరెస్టు
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ పదరా మండల పరిధిలోని మద్దిమడుగు సమీపంలో గల కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అడవి జంతువులను వేటాడిన నిందితులను పట్టుకున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్ తెలిపారు. వేటాడిన వన్యప్రాణుల మాంసాన్ని కృష్ణా నది గుండా ఏపీకి తరలిస్తున్న ముగ్గురికి అరెస్టు చేశామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఆరుగురు వేటగాళ్లు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో సంచరిస్తూ జంతువులను వేటాడి, ఏపీకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు.
ఇవాళ సాయంత్రం 5.00 గంటల ప్రాంతంలో కృష్ణా నది తీరం వెంబడి గస్తీ నిర్వహిస్తున్న అటవీ సిబ్బందికి గీసుగండి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలకు సరఫరా చేయడానికి కృష్ణా నది పుట్టిలను దాటుతుండగా అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్నారు. మొత్తం ఆరుగురు వేటగాళ్లలో ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు. వీరంతా గుంటూరు జిల్లా వాస్తవ్యులు. నది తీరంలో చేపల వేటకు వెళ్తూ వన్యప్రాణులను వేటాడుతున్నారని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా 2 చుక్కల దుప్పిలకు సంబంధించి మృత కళేబరాలను స్వాధీనం చేసుకుని నిందితుల పైన కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అటవీశాఖ అధికారి ఆదిత్య డిప్యూటీ రేంజర్ కాశన్న, ఎఫ్‌బివోలు రాంబాబు, జితేందర్లు పాల్గొన్నారు.