- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన 3 గ్యాస్ సిలిండర్లు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఓ హోటల్‌లో 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున శబ్దాలతో మంటలు ఎగిసిపడి, చెక్‌పోస్ట్ సర్కిల్ చుట్టుపక్కల ఉన్న పలువురి నివాసాలు దహనం అయ్యాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మంటలు చుట్టుపక్కల ఉన్న హోటల్స్, షాప్‌లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ పేలుడు మూలంగా నంద్యాల, నందికొట్కూరు రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Next Story