- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హాథ్రస్’ కుటుంబానికి పటిష్ట భద్రత
దిశ, వెబ్ డెస్క్: హాథ్రస్ బాధిత కుటుంబానికి పటిష్ట భద్రత కల్పించినట్టు సర్వోన్నత న్యాయస్థానానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. పారదర్శకమైన, కచ్చితమైన దర్యాప్తు కోసం బాధిత కుటుంబం, సాక్షులకు భద్రత కల్పించినట్టు వివరించింది. సీబీఐ విచారణను పర్యవేక్షించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
అలాగే, కేసు పురోగతిని పక్షంరోజులకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని, తద్వారా ఆ రిపోర్టును న్యాయస్థానంలో రాష్ట్ర డీజీపీ సమర్పించేందుకు వీలు కలుగుతుందని తెలిపింది. బాధిత కుటుంబానికి 3 ఫోల్డ్ సెక్యూరిటీ కల్పించినట్టు యూపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
ఇందులో ఆయుధాలతో కానిస్టేబుళ్లు, గన్నర్లు, షాడోలు, గార్డులతో సివిల్ పోలీసులు, సీసీటీవీల ఏర్పాట్లు ఉన్నాయని వివరించింది. బాధితలు ఇంటి వెలుపల ఎనిమిది సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు, అగ్నిమాపక యంత్రాలు, పది నుంచి 12 లైట్లనూ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. గ్రామంలోకి ప్రవేశమార్గం దగ్గర, బాధిత ఇంటికి దగ్గర 16 మంది పోలీసులను భద్రత కోసం నియమించినట్టు పేర్కొంది. ఈ కుటుంబం కోసమే 12 మంది కానిస్టేబుళ్లను నియమించినట్టు తెలిపింది.