ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

by Sumithra |   ( Updated:2021-02-04 05:11:57.0  )
accident
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గురువారం జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లిలో వ్యాన్, ఆటో ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మృతులు చాట్లపల్లికి చెందిన రమేశ్, శ్రీశైలం, కనకయ్యలుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి… పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed