విషాదం.. పిడుగుపాటుకు తల్లి, బిడ్డ మృతి.. తండ్రి పరిస్థితి విషమం

by Aamani |   ( Updated:2021-09-20 05:49:47.0  )
విషాదం.. పిడుగుపాటుకు తల్లి, బిడ్డ మృతి.. తండ్రి పరిస్థితి విషమం
X

దిశ, మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని పట్టణ ఓవర్ బ్రిడ్జీపై పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే నస్పూర్ కాలనీకి చెందిన అందే వెంకటేష్, అతని భార్య మౌనిక, కుమారుడు శ్రీయన్.. మంచిర్యాలలో వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద వెళ్తున్న వారిపై పిడుగుపడగా, భార్య మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది, కుమారుడు శ్రీయన్(4) మృత్యువాత పడ్డారు.

తీవ్రగాయాలతో వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంచిర్యాల నుండి నస్పూర్ వెళ్తున్న రూరల్ సీఐ కుమారస్వామి తక్షణమే స్పందించి బాధితుడిని, పాపని చికిత్స కొరకు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఏసీపీకి సమాచారం అందిన వెంటనే ఏసీపీ అఖిల్ మహాజన్ వెంటనే అక్కడికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించడం జరిగింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story