తగ్గిన సన్‌ఫార్మా నికర లాభం!

by  |
తగ్గిన సన్‌ఫార్మా నికర లాభం!
X

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాల్లో ఫార్మా దిగ్గజ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్స్ నిరాశజనకంగా ఉన్నట్టు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం 26.43 శాతం తగ్గి 913.52 కోట్లకు చేరుకుంది. గత త్రైమాసికంలో రూ. 1,242 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ త్రైమాసికంలో 26 శాతానికి పైగా తగ్గింది. సంస్థ వ్యయం గతంలో రూ. 6,203 కోట్లు ఉంటే, ఈ త్రైమాసికంలో రూ. 6,923 కోట్లకు పెరిగిందని సన్ ఫార్మా ఎమ్‌డీ దిలీప్ తెలిపారు. సంస్థ కార్యకలాపాల ఆదాయం సైతం గతంలో రూ. 7,657 కోట్ల నుంచి రూ. 8,039 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఇండియాలో బ్రాండెడ్ వ్యాపారం సానుకూలంగా ఉందని, ఈ త్రైమాసికంలో తొమ్మిది నెలల కాలానికి రెండంకెల వృద్ధిని సాధించిందని సంస్థ ప్రకటించింది. తాజాగా ఆల్ ఇండియన్ ఆరిజిన్ కెమిస్ట్స్ & డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్లో సన్ ఫార్మాదే అగ్రస్థానం అని, రూ. 1.48 కోట్ల ఫార్మా మార్కెట్‌లో తమ కంపెనీకి 8.2 శాతం ఉందని సంస్థ ఎమ్‌డీ పేర్కొన్నారు.

మోటోకార్ప్ :

ఇక హీరో మోటోకార్ప్ డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 17.07 శాతం పెరిగి రూ. 905.13 కోట్లకు చేరినట్టు సంస్థ త్రైమాసిక ఫలితాల్లో ప్రకటించింది. దీంతో గురువారం నుంచే హీరో మోటోకార్ప్ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం రూ. 772.81 కోట్లుగా నమోదైంది. శుక్రవారం సెన్సెక్స్‌లో హీరో మోటోకార్ప్ 28 పాయింట్లు పెరిగి రూ. 2,440 వద్ద ట్రేడవుతోంది.



Next Story