- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంఫాన్ ఎఫెక్ట్: బెంగాల్‌కు ఆర్మీ
by Shamantha N |
కోల్‌కతా: ఎంఫాన్ తుఫాన్‌తో కకావికలమైన పశ్చిమ బెంగాల్ సర్కారు విజ్ఞప్తి మేరకు ఆర్మీ.. మూడు కాలమ్‌ల ట్రూపులను కోల్‌కతాకు పంపింది. పునరావాస పనుల్లో భాగంగా కోల్‌కతా నగర అధికార యంత్రాంగానికి తోడ్పాటునందించేందుకు వీరిని పంపినట్టు ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి కోలుకునేందుకు ఆర్మీ సహా రైల్వే, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా మమతా బెనర్జీ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ విలయం నుంచి కుదుటపడేందుకు ప్రైవేటు సంస్థలూ భాగస్వాములు కావాలని కోరింది. ప్రభుత్వానికి అవసరమైన సిబ్బంది, పరికరాలను అందించాల్సిందిగా ట్వీట్ చేసింది.
Next Story