ముగ్గురు చిన్నారుల ప్రాణం తీసిన క్వారీ గుంత..

by Shyam |   ( Updated:2021-12-24 09:33:24.0  )
ముగ్గురు చిన్నారుల ప్రాణం తీసిన క్వారీ గుంత..
X

దిశ, కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్​స్టేషన్ పరిధి కేపీహెచ్‌బీ కాలనీ నాలుగవ ఫేజ్ ఆర్‌టీఐ కార్యాలయం వెనుక ఉన్న ఓ నిర్మాణం కోసం తీసిన భారీ క్వారీ గుంత సమీపంలో ఆడుకోవడానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు ప్రమాద వశాత్తు గుంతలో పడి మృతి చెందారు. గుంతలో నిండుగా నీరు ఉండటంతో ఎన్‌డీఆర్‌ఎప్​బృందం, గజ ఈతగాళ్లు మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్వారీ గుంతలో పడిన ముగ్గురిలో సోఫియా, సంగీత మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్​బృందం వెలికి తీయగా రమ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న సంగీత(12), రమ్య(7), సోఫియాలు(12) క్వారీ గుంత వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు.

ఆడుకుంటున్న క్రమంలో ముగ్గురు కాలు జారి గుంతలో పడ్డారు. దీంతో సమీపంలో ఉన్న వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేపీహెచ్‌బీ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగి చిన్నారులను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టగా అందులో ఇద్దరు బాలికల మృతదేహాలను ఎన్‌డిఆర్‌ఫ్​ బృందం వెలికి తీయగా మరో బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మొహరించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story