ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

by Shyam |
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
X

దిశ, మెదక్: ఓ గర్భిణికి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లికి చెందిన నర్సింగరావు, తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన సౌజన్యకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. సౌజన్య గర్భం దాల్చడంతో గజ్వేల్ ప్రభుత్వాసుత్రిలో చెకప్ చేయించుకున్నారు.

మూడు పిండాలు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. అయితే గురువారం తెల్లవారు జామున పురిటి నొప్పులు రాగా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణ ప్రసవంలో సౌజన్య ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed