అమీర్‌పేట్‌లో డ్రగ్స్ కలకలం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. గోవా నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న ముఠా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎర వేస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో పోలీసులు అమీర్‌పేట్‌ అనుమానంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరి వద్ద డ్రగ్స్‌తో పాటు.. ఎక్స్‌స్టసి పిల్స్, ఎండీఎమ్‌ఏల, చరస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులు బంటి, నవీన్ రాజ్, రోహిత్‌ గుర్తించిన పోలీసులు.. గోవాకు చెందిన డ్రగ్ ముఠా సభ్యులు కునాల్, రఫీ కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గోవా ముఠా పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement